Site icon NTV Telugu

Ramchander Rao: జూబ్లీహిల్స్ గెలుపు 2028లో బీజేపీ ప్రభుత్వానికి నాంది

Ramchanderrao

Ramchanderrao

జూబ్లీహిల్స్‌‌లో మజ్లిస్-బీజేపీ మధ్యే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష జరిగింది. జిల్లా నేతలకు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశానికి రామచందర్‌రావు, కిషన్‌రెడ్డి హాజరై డివిజన్ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇది కూడా చదవండి: Rajasthan: ఓ ప్రభుత్వాధికారి ఘరానా మోసం.. ఏ జాబ్ చేయకుండానే భార్యకు రూ.37.54 లక్షల జీతం.. వెలుగులోకి ఇలా..!

ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీకి ఓటు వేయకుంటే మజ్లిస్‌కు 8 సీట్లు అవుతాయన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎంను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ విజయానికి అవకాశాలు పెరుగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపించాలని ప్రజలకు ఆలోచన వచ్చిందని తెలిపారు. 2028 జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ గెలుపు నాంది కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ కానీ.. కాంగ్రెస్ కానీ చేసిందేమీ లేదన్నారు.

ఇది కూడా చదవండి: Kanpur: కాన్పూర్‌లో దారుణం.. లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికివేత

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం చెందారు. దీంతో జూబ్లీహిల్స్‌కు బైపోల్ అనివార్యమైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఫలితం మాత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ పోటీ పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Jaishankar-Rubio: మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు

Exit mobile version