NTV Telugu Site icon

Payal Shankar: బీజేపీ గురించి మాట్లాడితే ఏమైందో తెలుసు కదా..? కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్..

Payal Shankar

Payal Shankar

Payal Shankar: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అంటే ఏమనుకుంటున్నావ్ కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గురించి మాట్లాడితే ఏమైందో తెలుసు కదా? అని వార్నింగ్ ఇచ్చారు. రైతు భరోసా చర్చలో బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కో-ఆపరేటివ్ బ్యాంకులలో 65 నుంచి 70శాతం రుణమాఫి కాలేదన్నారు. రెండు లక్షల రుణమాఫి ఎప్పటి వరకు పూర్తి చేస్తుందీ స్పష్టం చేయాలన్నారు. రైతుల కాంగ్రెస్ పార్టీని నమ్మారు కాబట్టి అధికారం కట్టబెట్టారన్నారు. పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతు బంధు ఇవ్వనంటే బాధేస్తుందన్నారు. 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎక్కువగా ఉండరని తెలిపారు.

Read also: Telangana Assembly 2024 LIVE: నేడు 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

నాయకులకు ఫామ్ హౌస్ లు ఉన్నాయన్నారు. చివరకు బీజేపీ వాళ్లు కూడా మాట్లాడుతున్నారని కేటీఆర్ అంటున్నారు. ఉమ్మడి పది జిల్లాలను పాలించిన మీకే అంత ఉంటే 750 జిల్లాలను పాలిస్తున్న మాకెంతు ఉండాలి అని ప్రశ్నించారు. సభలో చిన్నచూపు చూసి మాట్లాడడం బాధ కలిగిస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలు 2014కంటే ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయము, రైతులు లేనట్లుందన్నారు. భూమి శిస్తు మీదనే ఆధారపడి ఆ నాడు పాలన సాగేదన్నారు. రైతులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తాము చేసినం ఆంటే తాము చేసినమని చెప్పుకుంటున్నాయని తెలిపారు. రైతులకు కేంద్రం ఇచ్చిన సహాయాన్ని గత ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. తెలంగాణలో కోటి ఇరువై లక్షల పత్తి కేంద్రం కొనుగోలు చేయకపోతే వేలాది మంది రైతులు ఇబ్బంది పడేవారన్నారు. రూ.8 లక్షల 50వేల సోయాబిన్ ను కేంద్రమే కొంటుందని తెలిపారు. జనవరిలో రైతు భరోసా ఇస్తామనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ఉంది సంతోషం అన్నారు.

Read also: KTR Challenge: కేటీఆర్ స‌వాల్.. రాజీనామా ఇచ్చి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా..

హోటల్ లో టిఫిన్ చేస్తే టిప్పు ఇస్తాం.. రైతు పండించిన టమాటా కిలో పదిహేను అంటే పదికి ఇవ్వమని అడుగుతున్నామన్నారు. రైతులను అవమానిస్తున్నామన్నారు. రైతు బిడ్డలకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో 90శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. కార్పోరేట్ ఆసుపత్రిలో రైతులకు 90శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ అంటే కార్పోరేట్ ఆసుపత్రులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయ పొలాలకు రోడ్లు వేయండి అన్నారు. వర్షాకాలంలో పొలాలకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయ పొలాలకు రోడ్లు వేసేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని తెలిపారు. పది లక్షలతో రైతులు ఇళ్లు కట్టుకుంటామంటే బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చే అవకాశం లేకుండా చూడాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ రంగాన్నీ అనుసంధానం చేయాలన్నారు.

Read also: Harish Rao Vs Komatireddy: కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా..

పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వానికీ భారం తగ్గుతుందన్నారు. పాతతరం విత్తనాల చట్టాన్ని మార్చాలన్నారు. నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేసిన వాళ్లు కనీసం 90రోజులు జైలు నుండి బయటకు రావద్దని తెలిపారు. ప్రపంచంతో రైతు పోటీ పడేలా ప్రోత్సహించాలని అన్నారు. ఎన్ని సబ్సిడీలు, రుణమాఫీలు ఇచ్చిన రైతులు బాగపడ్డారు అన్నారు. సభా సమయాన్ని వృథా చెస్తున్నారు తప్పైతే సలహాలు, సూచనలు ఇవ్వడం లేదన్నారు. రైతులకు వ్యవసాయ పని ముట్లు అవసరం అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల కింద ట్రాక్టర్లను బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకుందన్నారు. వ్యవసాయానికి అనుబంధమైన పరిశ్రమలపైన దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు.

Show comments