NTV Telugu Site icon

Payal Shankar: లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి బీసీలపై పెట్టారు..

Payal Shankar

Payal Shankar

Payal Shankar: జనాభా లెక్కన రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన అని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. పూలే వారసులం అయిన బీసీలకు చదువులు దక్కడం లేదు.. తాము కరిగిపోతూ సమాజానికి సేవ చేస్తున్నాం.. అవకాశాలు మాత్రం బీసీలకు రావడం లేదు.. గత పాలకులు 7లక్షల కోట్ల అప్పులు చేశారు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ అప్పు మరింత పెరిగింది.. లక్షల కోట్ల రూపాయల అప్పు బీసీలపై పెట్టారు అని ఆయన ఎద్దేవా చేశారు. 2 కోట్లకు పైగా ఉన్న బీసీలకు ఎంత ఉపాధి దక్కుతుంది, ఎన్ని నిధులు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. బీసీలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. 60 శాతం బీసీలకు స్థానిక సంస్థల ప్రతినిధులు అయితే సరిపోదు.. శాసనసభలో కూడా ప్రాతినిధ్యం కావాలి అని డిమాండ్ చేశారు. రెండు పార్టీలు ఆడుతున్న నాటకంలో బీసీలు బలి అవుతున్నారు అని పాయల్ శంకర్ పేర్కొన్నారు.

Read Also: AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్‌.. అజెండా ఇదే..

ఇక, మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు అని హైకోర్టు కొట్టివేసింది అని బీజేఎల్పీ ఉపనేత శంకర్ తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టులో స్టే కొనసాగుతుంది.. టెక్నికల్ గా కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాను.. అలాగే, అడ్వకేట్ జనరల్ గా బీసీలకు అవకాశం రావడం లేదు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి అన్నారు. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చి సీఎం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. జడ్జి నియామకంలో కొలీజియంకు పంపే పేర్లలో అన్యాయం జరుగుతుంది.. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 7నుంచి 8 వేల కోట్ల రూపాయలు వస్తాయని అనుకున్నాం.. 22 ఓట్లు ఉన్న ఓ ఇంట్లో 5 పదవులు ఉన్నాయి.. అలాగే, నల్గొండ జిల్లా నేతలకు ఒక్క ఇంట్లినే రెండు మూడు పదవులు ఉన్నాయని ఆరోపించారు. 19 మంది మాత్రమే బీసీలు ఉన్నారంటే అందరూ అర్థం చేసుకోవాలి.. బీసీల ఆత్మగౌరవ భవనాల్లో కూడా అన్యాయం జరిగింది.. ఎవరితోనూ సంబంధం లేదు.. బీసీలకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతాను అని పాయల్ శంకర్ చెప్పుకొచ్చారు.

Read Also: Crime: క్రైమ్ షోలు చూసి భార్యను చంపిన భర్త.. విచారణలో షాకింగ్ విషయాలు

ఇక, భవిష్యత్తులో బీసీలకు మంచి జరగాలనేదీ ఈ బిల్లు ఉద్దేశం అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కాగితాల మీద కార్పోరేషన్లు ఇస్తే బ్రతుకులు మారవు.. 33 జిల్లాలను పాలిస్తున్న మీకే ఇంత ఆతృతగా ఉంటే దేశంలో ఇన్ని రాష్ట్రాలు, దేశాన్ని పాలిస్తున్న మాకెంత ఆతృత ఉంటుంది అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సహేతుకం అయితే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని చెప్పింది.. అప్పుడు సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించి ఉంటే ఆ తీర్పు వచ్చేది కాదు.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది.. సుప్రీంకోర్టు తీర్పును బూచిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కోర్టును ఒప్పించగలిగాం.. మా బాధలు అందరికీ తెలియాలి.. కాంగ్రెస్ ఆలోచన తీర్మానం చేసి పంపితే అయిపోతుంది అన్నట్టు ఉంది.. మంచి పని చేసే ముందు పాజిటివ్ గా ఆలోచన చేయాలి.. చర్చ ప్రారంభానికి ముందే ఇతరులపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు.. రాజకీయాల్లో బీసీల రిజర్వేషన్లకు మేం మద్దతు ఇస్తున్నామని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ వెల్లడించారు.