Site icon NTV Telugu

Happy Birthday CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషేస్ తెలిపిన మోడీ, చంద్రబాబు, స్టాలిన్, డీకే!

Revanth Reddy

Revanth Reddy

Happy Birthday CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా భారీగా విషెస్‌ చెబుతున్నారు. తాజాగా సీఎం రేవంత్‌ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే విషేస్ చెప్పారు. రేవంత్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్‌ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

Read Also: Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన!

ఇక, సీఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మెగాస్టార్ చిరంజీవి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version