NTV Telugu Site icon

Balapur Ganesh Laddu: అందరి చూపు బాలాపూర్‌ లడ్డూ వేలం పైనే.. ఈసారి రూ.30 లక్షలు పైమాటే..?

Balapur Ganesh Laddu

Balapur Ganesh Laddu

Balapur Ganesh Laddu: దేశమంతటా మండపాలలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరేందుకు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి భాగ్యనగరంలోని బాలాపూర్ లడ్డూ వేలంపైనే ఉంది. ప్రతి సంవత్సరం వేలంలో రికార్డు ధర పలుకుతోంది. అందుకే భక్తుల గుండెల్లో బంగారంగా నిలిచిన గణనాథుడి లడ్డూ వెలమ పాట కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట మొదలు పెట్టనున్నారు. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూలు ఈసారి ఎంత ధర పలుకుతాయోనని ఉత్కంఠ నెలకొంది. వినాయక విగ్రహాల ఎత్తులోనే కాదు.. ఆయన చేతిలో పెట్టే లడ్డూల సైజుల్లోనూ పోటీ పెరిగింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి బాలవూరు గణేశుడి విగ్రహం కంటే బాలాపూర్ గణేశుడి చేతిలోని లడ్డూపై పడింది. ఈ ఏడాది వేలం పాటలో లడ్డూ బద్దలు కొడుతుందేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

Read also: September 17: ఇటు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం.. అటు బీజేపీ విమోచన దినోత్సవం..

గత 30 ఏళ్లుగా జరుగుతున్న ఈ లడ్డూ వేలం ఏటా రికార్డులు బద్దలు కొడుతోంది. అందుకే ప్రతి వినాయక చవితి.. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఎంత అన్నది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బాలాపూర్ లడ్డూను కొనుగోలు చేసేందుకు పలువురు వేలంలో పాల్గొంటారు. లక్షలు చెల్లించినా బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతేడాది వేలం మొత్తం జమ చేయాలి. అంటే 27 లక్షల ధరకు కొనుగోలు చేసిన వారి పేరు బాలాపూర్ లడ్డూ వేలంలో ఉంటుందన్నమాట. అయితే ఇంతకుముందు ఈ నిబంధన స్థానికేతరులకు మాత్రమే ఉండేది. ఈసారి స్థానికులకు కూడా అదే నిబంధన వర్తింపజేశారు. గ్రామస్తుల నుంచి కూడా తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది లడ్డూ కోసం రూ.27 లక్షలు డిపాజిట్ చేసిన వారికే లడ్డూ వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈసారి రూ.30 లక్షలకు పైనే పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Khairatabad Ganesh: మొదలైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభాయాత్ర..

Show comments