NTV Telugu Site icon

Hyderabad: ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా..

Auto

Auto

Hyderabad: ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహా లక్ష్మి స్కీమ్ కు ముందు యావరేజ్ గా 1000 రూపాయలు సంపాదన ఉంటే.. ఇప్పుడు 500 కూడా సరిగ్గా రావడం లేదు అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.. అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. యాప్ లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ విలర్లను నిషేధించాలని కోరారు. ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచి.. సాధారణ మరణాలకు వర్తింప చేయాలని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ జేఏసీ డిమాండ్ చేసింది.

Read Also: Uttara Pradesh Madrasa Act: యోగి ప్రభుత్వానికి షాక్.. మదర్సా చట్టంలో హైకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు

మరోవైపు ఆటో, ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ డ్రైవర్ల మహాధర్నాకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకపై సందిగ్ధం నెలకొంది. ఈ ధర్నాలో సీఐటీయూ, ఏఐసీయూటీ, బీఆర్టీయూ, టీయూసీఐ, జీయూసీఐ, యూటీఏడీడబ్ల్యూఏ, టీఏడీఎస్ లాంటి సంఘాలు పాల్గొన్నాయి. కానీ, బీఆర్టీయూ సంఘం కేటీఆర్ నీ జేఏసీకి తెలియకుండా స్వాగతించారని.. మిగితా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో కేటీఆర్ రావడంపై నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.