NTV Telugu Site icon

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు టూరిజం పాలసీపై చర్చ..

Telangana Assembly 2024

Telangana Assembly 2024

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం టూరిజం పాలసీపై చర్చకు ప్రతిపాదించింది. బీఆర్‌ఎస్‌ లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చకు పట్టబడుతోంది. ఈ నేపథ్యంలో సమావేశాలు నేడు కూడా వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది.

Read also: Pushpa2 : 11 రోజుల పుష్ప-2 వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే..?

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగే అవకాశం ఉంది. క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకుని సభలను శుక్రవారంతో ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక సెషన్స్ నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పష్టత రాలేదు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది.

Read also: IND vs AUS: అవన్నీ నకిలీ వార్తలు.. నాకెలాంటి సంబంధం లేదు: కుంబ్లే

ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి పాయల్‌శంకర్‌, ఏఐఎంఐఎం నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశ తేదీలు, ఎజెండాపై ప్రభుత్వ ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం 15 రోజులపాటు సభ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది. మరోవైపు, ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా బీఏసీ సమావేశం నిర్వహించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Astrology: డిసెంబర్ 17, మంగళవారం దినఫలాలు

Show comments