హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు. నీలోఫర్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల ఆర్నవ్ తుది శ్వాస విడిచాడు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు లిఫ్ట్ లో చిక్కుకున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడని.. ఈ కారణంగానే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు వెల్లడించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:PM Modi: మరో విదేశీ పర్యటనకు మోడీ.. మారిషస్ నేషనల్ డే వేడుకలకు హాజరు
ఫిబ్రవరి 21న హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ శాంతి నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గోడే కబర్‌కు చెందిన అజయ్ కుమార్ కుమారుడు అర్నావ్ (6) తన తాతతో కలిసి శాంతినగర్ లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్న మేనత్త ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో లిఫ్ట్ లో పై అంతస్తుకు వెళ్లేందుకు ఆ బాలుడు లిఫ్ట్‌బటన్ నొక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ బాలుడు లిఫ్ట్‌డోరుకు, గోడకు మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు, హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Also Read:Bank Holidays in March 2025: మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రెండు గంటలు శ్రమించి బాలుడిని బయటకు తీశారు. బాలుడు తీవ్రంగా గాయపడడంతో క్షణం ఆలస్యం చేయకుండా బాలుడిని నీలోఫర్‌ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు అర్నావ్ ప్రాణాలు కోల్పోయాడు. లిఫ్ట్ ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో లిఫ్ట్ ఆపరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని అపార్ట్ మెంట్ వాసులకు అధికారులు సూచిస్తున్నారు.