Arikepudi Gandhi warning: నేను గాంధీ అన్న పేరు 10 రోజులు పక్కనపెట్టి కౌశిక్ రెడ్డి సంగతి చూస్తా అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్.. బ్రోకర్ కౌశిక్ రెడ్డి నాపై సవాల్ చేస్తాడా? అని ప్రశ్నించారు. నేను ఎవ్వరికి బయపడను.. నేను నిజాయితీ పడుడైన సీనియర్ ఎమ్మెల్యేను.. అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను.. ఆ విషయం అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారన్నారు. అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ ను కలిశానని తెలిపారు. బ్రోకర్ కౌశిక్ రెడ్డి కి సమాధానం చెరుప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెబుతా అన్నారు. నేను గాంధీ అన్న పేరు 10 రోజులు పక్కనపెట్టి కౌశిక్ రెడ్డి సంగతి చూస్తా అన్నారు.
Read also: Rajanna Sircilla: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ.. రోడెక్కిన విద్యార్థినిలు
నువ్వు చాలెంజ్ చేసినట్టు నా ఇంటికి వచ్చి జెండా ఎగురవేయక పోతే నీ ఇంటికి వచ్చి నా తడాఖా ఏంటో చూపిస్తాను అని సవాల్ విసిరారు. ఇలాంటి వాళ్ళ కెసీఆర్ ఆలోచన చేయాలన్నారు. కౌశిక్ గాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి విషయంలో కేటీఆర్ చాలా సార్లు మందలించాడు. అయిన కౌశిక్ పద్ధతి మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజులు నాకు భారతీయుడు రోల్ ఇవ్వండి.. సమాజంలో ఉన్న చీడ పురుగులను ఏరి వేస్తానని తెలిపారు. నామినేషన్ వేశాను నాకు puc ఛైర్మన్ పదవి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేను చేరలేదు.. దేవుడి కండువా నాకు రేవంత్ రెడ్డి కప్పారని తెలిపారు. భక్తి పూర్వకంగా శాలువా కప్పారన్నారన్నారు. పార్టీ మార్పు మీద న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలన్నారు. స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూస్తామన్నారు. ఆగష్టు 15, జనవరి 26 న మూడు రంగుల కండువా వేసుకుంటాము..కాంగ్రెస్ లో చేరినట్టా అని అరికెపూడి గాంధీ అన్నారు.
Arekapudi Gandhi: మా ఇంటికి రాకుంటే నీ ఇంటికి నేనే వస్తా.. కౌశిక్ రెడ్డి కి అరికపూడి సవాల్