Minister Ponnam: ఢిల్లీలో అఖిల భారత నాయకత్వంతో కీలక సమావేశాలు జరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిన్న ఖర్గే నివాసంలో తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది.. భారత్ జోడో యాత్రలో అసమానతలు గమనించి కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. కేంద్రంలో అధికారంలోకి రాకపోయినా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కుల గణన చేసింది అన్నారు. 56 ప్రశ్నలతో.. 150 ఇండ్లను ఒక బ్లాక్ గా చేసి, శాస్త్రీయ బద్దంగా కులగణన చేశాం.. సర్వేలో మూడున్నర కోట్ల ప్రజలు స్వచ్ఛందంగా తమ సమాచారం ఇచ్చారు.. బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ కు పంపించాం.. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది.. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం.. తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి అద్భుతమైన సర్వేను సిద్ధం చేశారనీ అగ్రనాయకులు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: Udaipur Files: “ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాపై స్టే కుదరదు: సుప్రీంకోర్టు..
ఇక, బీజేపీ అభ్యంతరాలు చెప్పాలనుకుంటే అసెంబ్లీలోనే లెవనెత్తాల్సింది.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే బీజేపీ నేతలు భయపడుతున్నారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి జాగ్రత్త.. ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ బీసీకి అవకాశం ఇవ్వలేదు.. బండి సంజయ్ ను తొలగించి.. కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అయ్యారు.. తెలంగాణలో కమలం పార్టీ గెలిచే అవకాశం లేదు.. బీఆర్ఎస్ తో కుమ్మక్కై రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. ముస్లీంల రిజర్వేషన్లు గురించి బీజేపీ మాట్లాడుతుంది.. ముందు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లీం రిజర్వేషన్లు తొలగించండి అని సవాల్ విసిరారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యే రిజర్వేషన్లు.. చట్ట సభల వరకు పోతాయన్నారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకం.. వారిపై తిరుగుబాటు తప్పదు.. తెలంగాణలో బీజేపీ బ్రతకడానికి ఎంఐఎం జపం చేస్తుంది.. ఎంఐఎం, బీజేపీ జపం చేస్తుందని పొన్న ప్రభాకర్ విమర్శించారు.
