Hyderabad: నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం దగ్గర ధర్నా చేయనున్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయనున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక, కార్పొరేటర్లకు మద్దతుగా ధర్నాలో గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోనున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ధర్నాకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని కోరారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, హైదరాబాద్ మహానగరంలో రోజువారీ కూలీలు, స్టూడెంట్స్, పేద ప్రజల ఆకలిని కేవలం ఐదు రూపాయలకే తీరుస్తున్న ‘అన్నపూర్ణ’ క్యాంటిన్ కేంద్రాలు ఇకపై కొత్త పేరు, కొత్త హంగులతో కనిపించనున్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ పథకం యొక్క రూపురేఖలను సమూలంగా మార్చబోతుంది. నగర వాసులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో స్టాండింగ్ కమిటీ పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది.