Ponnam Prabhakar: హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కుల గణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకుల సర్వే గురించి మాట్లాడే హక్కు లేదు అన్నారు. ఈ కుల గణన సర్వేలో కవిత మాత్రమే పాల్గొన్నది.. ఆమెకు అడిగే హక్కు ఉందని తెలిపారు. కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
Read Also: Delhi Elections: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్
అయితే, కుల గణన సర్వే మాములు ప్రక్రియ కాదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వేలో లక్ష మంది ఉద్యోగులు పాల్గొన్నారు.. అలాగే, జీహెచ్ఎంసీ మేయర్ పదవికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ఎందుకంటే.. మాకు సభలో మెజార్టీ నిరూపించుకోవడానికి తగిన బలం ఉంది.. బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదు అని చెప్పుకొచ్చారు.