Deputy CM Bhatti: హైదరాబాద్ లో నిర్వహించిన క్వాంటం పవర్డ్ ఎకానమీ స్ట్రాటజీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ గురించి దేశం చర్చిస్తుంది.. దాని ఆవిష్కరణకి తెలంగాణను ఎంచుకున్నందుకు నీతి ఆయోగ్ కి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. డిజిటల్, టాలెంట్ కి హైదరాబాద్ కి కేంద్రంగా మారింది అన్నారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా టెక్నాలజీని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు.. అయితే, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తుంది అని డిప్యూటీ సీఎం విక్రమార్క పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా!
అయితే, తెలంగాణ 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీకి చేరుకోవాలని ప్లాన్ చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నీతి ఆయోగ్ కూడా గ్లోబల్ సమ్మిట్ లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అన్ని రంగాల పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం.. యంగ్ ఇండియా స్టార్టప్ కోసం ఫండింగ్ చేయాలని నిర్ణయించాం.. 1000 కోట్ల రూపాయలతో స్టార్టప్ లను ప్రోత్సహిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
