ACB Raids: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఆరు నెలల్లో 126 కేసులు
- తెలంగాణలో దూకుడు పెంచిన ఏసీబీ..
- 6 నెలల్లోనే 126 కేసులు నమోదు..
- 125 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids: తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారులను కటకటాల పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారే టార్గెట్ గా తనిఖీలు చేసిన అక్రమార్కులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా, తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. మారుమూల ప్రాంతాల నుంచి కంప్లైంట్ వస్తే.. అక్కడికి వెళ్లి లంచగొడ్డిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తగిన శిక్షలు విధిస్తున్నారు.
Read Also: SC-ST reservation: సుప్రీంకోర్టు సిబ్బంది నియామకాల్లో తొలిసారి SC-ST రిజర్వేషన్..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఇక, జనవరి నుంచి జూన్ వరకు కేవలం 6 నెలల్లో 126 కేసులు నమోదు చేసింది ఏసీబీ. జూన్ నెలలో 31 కేసులు నమోదు కాగా, అందులో 15 ట్రాప్, 2 అక్రమాస్తుల కేసు, 3 క్రిమినల్ దుష్ప్రవర్తన, 4 రెగ్యులర్ కేసులు, 7ఆకస్మిక తనిఖీల కేసులు ఉన్నాయి. ఏసీబీ కేసుల్లో అరెస్ట్ అయిన ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులు జ్యూడిషల్ రిమాండ్ కు తరలించారు. ఏసీబీ ట్రాప్ కేసులో 3.43 లక్షల రూపాయల డబ్బు సీజ్ చేయగా.. రెండు అక్రమ ఆస్తుల కేసులో 13.50 లక్షల ఆస్తులు, 5.22 లక్షల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Telangana CM: తెలంగాణను చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు..
అయితే, ఆర్టీఏ, సబ్ రిజిష్టర్ తనిఖీల్లో లెక్క చూపని రూ. 2.72 లక్షలు సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. 6 నెలల్లో 80 ట్రాప్ కేసులు, 8 అక్రమాస్తుల కేసులు, 14 క్రిమినల్ దుష్ప్రవర్తన, 10 రెగ్యులర్ ఎంక్వైరీలు, 11 ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. ఇందులో 8 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ట్రాప్ కేసుల్లో 24.57 లక్షల మొత్తం స్వాధీనం చేసుకోగా.. డీఏ కేసులలో 27.66 లక్షల విలువైన ఆస్తులను వెలికి తీశారు.. ఆర్టీఏలో జరుగుతున్న అక్రమలపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!