Aadi Srinivas: స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో కూర్చొనే కహానీ లు చెప్తున్నారని మండిపడ్డారు. పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంకా భ్రమల్లో ఉన్నారు.. సైకాలజిస్ట్ కి చూపించుకుంటే బెటర్ అంటూ సలహా ఇచ్చారు. తెలంగాణ రైతులు.. ప్రజలను అవమాన పరిచేలా వ్యవహారం చేస్తున్నారని అన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది కేసీఆర్ సర్కార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం మీద యావ ఎంత ఉందో కేసీఆర్ మాటలు వింటుంటే అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ మీద విశ్వాసం లేక… ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు.
Read also: Tummala Nageswara Rao: రైతులను ఆదుకోండి.. తుమ్మలకు వినతిపత్రం
భవిష్యత్తులో మీతో ఎవరు ఉంటారో చూసుకోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం విలువల గురించి కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మండిపడ్డారు. ఫిరాయింపులు మొదలుపెట్టిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ ది త్యాగాల చరిత్ర.. కేటీఆర్ ది భోగాల చరిత్ర అన్నారు. హరీష్ ని ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. మీరు పార్టీ ఫిరాయింపుల చేసినప్పుడు ఏమైంది మీ సోయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఫార్మెట్లో హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని గుర్తు చేశారు. ఇప్పటికే డబుల్ సిక్సర్ కొట్టాము.. రాత్రి ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారని గుర్తు చేశారు. మరో సిక్సర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడతారని ధీమా వ్యక్తం చేశారు.