Crime News: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాగేష్ ను కర్రతో కొట్టి చంపేశాడు అతడి స్నేహితుడు నర్సింగ్.. నిన్న (మార్చ్ 5) రాత్రి మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన గొడవతో.. ఆవేశంలో నాగేష్ పై కర్రతో దాడికి దిగాడు నర్సింగ్.. దీంతో నగేష్ కింద పడిపోవడంతో అక్కడి నుంచి నర్సింగ్ పరిపోయాడు. నాగేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
Read Also: Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
అయితే, ఈ దాడిపై సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగేష్, నర్సింగ్ ఉప్పర్ బస్తీకి చెందిన వాళ్ళుగా గుర్తించారు. వీళ్లు బ్యాండ్ మేళం వాయిస్తూ జీవనం సాగిస్తున్నారు అని తెలిపారు. ఇక, నిందితుడు నర్సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. గొడవ సమయంలో మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వారి దగ్గర నుంచి హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.