NTV Telugu Site icon

Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే.. సేకరించే వివరాలు ఇవే..

Telangana Kutumba Servey

Telangana Kutumba Servey

Telangana: కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. ఇవాళ ఇంటింటికి కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులాల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేటి నుంచి నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఇళ్ల జాబితా నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల పేర్లు కోడ్ రూపంలో సేకరించబడతాయి. ఇంటి జాబితాలో వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా నమోదు చేయబడ్డాయి. ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ జతచేయబడుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే కోసం 75 ప్రశ్నల ఫార్మాట్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రశ్నలు రెండు భాగాలుగా ఉంటాయి. కాగా.. 8 పేజీల్లో ఆయా వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు.

Read also: KTR Tweet: కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్..

సేకరించే వివరాలు ఇవే..

1. పార్ట్-1లో 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, విద్యార్హత, పలు వ్యక్తిగత వివరాలను అడుగుతారు.

2. పార్ట్-2లో కుటుంబ ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతారు. ముందుగా.. ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. ఈ సర్వేలో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించారు.

3. సర్వేకు హాజరైన వారిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులు ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కూడా పని చేయాల్సి ఉంటుంది.

4. ఆధార్ వివరాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. అధికారులు మాత్రం ఆధార్ గురించి ప్రజలకు వివరించి నంబర్ తీసుకోవాలని ఎన్యుమరేటర్లకు చెప్పారు.

5. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి ఎంత మంది నివసిస్తున్నారనే వివరాలను కూడా ఈ సర్వేలో సేకరిస్తారు. ఇందుకోసం సర్వే పేపర్‌లో మాతృభాష కాలమ్ ఉంది. వీటికి 19 రకాల కోడ్‌లను కేటాయించారు.

Read also: Rangareddy Fire Accident: కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..

6. తమిళం, మలయాళం, కన్నడ తదితర ఉత్తరాది రాష్ట్రాలు మాతృభాషలే కాదు.. లంబాడీ, కోయ, గోండు వంటి గిరిజనులు, ఆదివాసీలు మాట్లాడే స్థానిక భాషల వివరాలు కూడా నమోదు చేయబడతాయి.

7. వికలాంగులకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తారు. వారి వైకల్యం తీవ్రత, కండరాల క్షీణత, యాసిడ్ బాధితులు, మరుగుజ్జు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, నత్తిగా మాట్లాడటం, మానసిక అనారోగ్యం, పార్కిన్సన్స్, తలసేమియా తదితర 13 రకాల వైకల్యాల వివరాలను సేకరిస్తారు.

8. కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్‌, వివాహితుల వివరాలు, పెళ్లి కానీ వారి వివరాలను కూడా సేకరిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల గురించి కూడా సమాచారం తెలుస్తుందన్నారు.

9. బడి మానేసిన వారు, ప్రస్తుత విద్యార్థులు, చదువు పూర్తి చేసిన వారు. చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న వారి వివరాలను సేకరిస్తారు.

10. వారి వార్షిక ఆదాయం, ఆదాయపు పన్ను చెల్లింపుల గురించి కూడా వారు తెలుసుకుంటారు. వ్యవసాయం, బీడీ, హోటల్, కార్ఖానా, కూలీలు, ఉపాధి హామీ, మైనింగ్ కార్మికులు, ఇటుక బట్టీల కార్మికుల వివరాలను కూడా సేకరిస్తారు.

11. గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల వివరాలు, రాజకీయ నేపథ్యం వంటి వివరాలను సేకరించనున్నారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లిన వారి వివరాలు సర్వేలో తెలుసుకోనున్నారు.
Rajnath singh: బీజేపీని గెలిపిస్తే.. జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం