తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.