Site icon NTV Telugu

‘అఖండ’పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రశంసలు

akhanda

akhanda

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఇప్పటికే రికార్డులు కొల్లగొడుతోంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్ము రేపుతోంది. తాజా ఈ సినిమాపై హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా ద్వారా రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు మూవీ టీమ్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

అఖండ సినిమాలో హీరో బాలయ్య, హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ ఇద్దరూ కారులో వెళ్లే ఓ సీన్‌‌ను హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో బాలయ్య, హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్ ఇద్దరూ సీట్‌ బెల్టు పెట్టుకుని ఉంటారు. ‘కారు సీట్ బెల్ట్ ధరించి ఎంత దూరమైనా, ఎవరి కారు అయినా సరే ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి’ అంటూ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే ప్రజలందరూ కారులో వెళ్లేటప్పుడు సీట్‌ బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని వారు సూచనలు చేశారు.

Exit mobile version