Site icon NTV Telugu

Indigo Flight : హైదరాబాద్‌ నుంచి వెళ్లిన విమానానికి గోవాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Indigo

Indigo

Indigo Flight : గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది… 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం గోవాకు బయల్దేరింది ఇండిగో విమానం.. అయితే.. గోవా ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో.. ఊహించని పరిస్థితి ఎదురైంది.. సడన్‌గా రన్‌వే పైకి దూసుకొచ్చింది మరో విమానం.. దీంతో, అప్రమత్తమైన పైలట్… విమానం రన్‌వేపై ల్యాండైన వెంటనే.. అంటే కేవలం 15 సెకన్లలో మళ్లీ టేకాఫ్‌ చేశారు.. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ పరిణామాలతో పెను ప్రమాదం తప్పిపోయింది.. ఇక, ఆ తర్వాత గాల్లో 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది విమానం.. 20 నిమిషాల తర్వాత ఏటీసీ నుంచి క్లియరెన్స్‌ రావడంతో గోవాలో సేఫ్‌గా ల్యాండైంది ఇండిగో విమానం.. దీంతో.. అధికారులు, సిబ్బంది, విమానంలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గతంలోనే రెప్పపాటు సమయంలో పెను ప్రమాదం నుంచి ఎన్నో విమానాలు బయటపడగా.. కొన్ని ఘోర ప్రమాదానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Read Also: APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు

Exit mobile version