Hyderabad Weather : భానుడి భగభగలకు బ్రేక్.. హైదరాబాద్లో అకస్మాత్తుగా మారిన వాతావరణం..
- ఎండల మధ్య హైదరాబాద్లో అకస్మాత్తుగా వర్షం
- క్యూములోనింబస్ మేఘాలతో చీకటి వాతావరణం
- వడగాల్పుల నుంచి నగరవాసులకు ఊరట
- వర్షంతో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు
Hyderabad Weather : గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ప్రకృతి ఊరటనిచ్చింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలను నల్లటి మబ్బులు కమ్మేయడంతో పట్టపగలే చీకటి అలుముకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఈ అకస్మాత్తు వాతావరణ మార్పులకు క్యూములోనింబస్ (Cumulonimbus) మేఘాల ప్రభావమే కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండ తీవ్రత వల్ల ఏర్పడిన వేడి కారణంగా ఈ మేఘాలు ఒక్కసారిగా నగరాన్ని చుట్టుముట్టాయి. దీంతో సాయంత్రం 5 గంటలకే నగరం మొత్తం చీకటిమయమై, గంభీరమైన వాతావరణం ఏర్పడింది.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
వరుసగా పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజలు ఈ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రం వేళ ఆకాశం నల్లగా మారి చినుకులు మొదలవ్వడంతో జనం ఉపశమనం పొందారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ మార్పు రావడంతో చాలా మంది వర్షంలో తడుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు.
ఆకస్మిక వర్షం వల్ల నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నెమ్మదించింది. చీకటి ఎక్కువగా ఉండటంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాల్లో స్వల్పంగా నీరు చేరడంతో రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది. ఏదేమైనా, మండే ఎండల నుంచి ఈ వాన కొంత ఉపశమనం కలిగించిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!