Phone Snatching: హైదరాబాద్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

  • కంచన్‌బాగ్‌లో స్నాచింగ్ ముఠా అరెస్ట్
  • సీసీటీవీ ఆధారాలతో నిందితుల పట్టివేత
  • రూ.లక్షల ఫోన్లు, బైక్ స్వాధీనం
  • పరారీలో మరో గ్యాంగ్ కోసం గాలింపు
Phone Snatching

Phone Snatching

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని కంచన్‌బాగ్ పోలీసులు భారీ కేటుగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. అమాయక పాదచారులను లక్ష్యంగా చేసుకుని సెల్ ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. వారి వద్ద నుంచి రూ. లక్షల విలువైన 10 మొబైల్ ఫోన్లతో పాటు నేరానికి ఉపయోగించిన ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

యూనివర్స్ బాస్ Chris Gayle మరో అడుగు.. ఆ జట్టుకు సహాయజమానిగా కొత్త ప్రయాణం..!

ఈ నెల 15వ తేదీన డీఎంఆర్‌ఎల్ (DMRL) చౌరస్తా వద్ద ఒక వృద్ధుడి నుంచి మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కెళ్లిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనా స్థలంలోని సీసీటీవీ విజువల్స్‌ను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి, పక్కా ప్లాన్‌తో వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన ముగ్గురు కూడా పాత నేరస్తులేనని, వారిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరు ఒక పద్ధతి ప్రకారం చోరీలకు పాల్పడేవారని వెల్లడించారు. రోడ్లపై వెళ్లే ఒంటరి వ్యక్తులను ముందుగా లక్ష్యంగా చేసుకుని, ఒకరు ఫోన్ లాక్కుంటే, మరొకరు చుట్టుపక్కల ఎవరూ గమనించకుండా నిఘా ఉంచేవారు. గందరగోళం సృష్టించి అక్కడి నుంచి బైక్‌పై పరారవ్వడం వీరి నైజం.

ప్రస్తుతం అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రోడ్లపై నడిచేటప్పుడు , ఫోన్లలో మాట్లాడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

యూనివర్స్ బాస్ Chris Gayle మరో అడుగు.. ఆ జట్టుకు సహాయజమానిగా కొత్త ప్రయాణం..!