Phone Snatching: హైదరాబాద్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
- కంచన్‌బాగ్‌లో స్నాచింగ్ ముఠా అరెస్ట్
- సీసీటీవీ ఆధారాలతో నిందితుల పట్టివేత
- రూ.లక్షల ఫోన్లు, బైక్ స్వాధీనం
- పరారీలో మరో గ్యాంగ్ కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని కంచన్‌బాగ్ పోలీసులు భారీ కేటుగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. అమాయక పాదచారులను లక్ష్యంగా చేసుకుని సెల్ ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. వారి వద్ద నుంచి రూ. లక్షల విలువైన 10 మొబైల్ ఫోన్లతో పాటు నేరానికి ఉపయోగించిన ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
యూనివర్స్ బాస్ Chris Gayle మరో అడుగు.. ఆ జట్టుకు సహాయజమానిగా కొత్త ప్రయాణం..!
Also Read
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
- CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ఈ నెల 15వ తేదీన డీఎంఆర్‌ఎల్ (DMRL) చౌరస్తా వద్ద ఒక వృద్ధుడి నుంచి మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కెళ్లిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనా స్థలంలోని సీసీటీవీ విజువల్స్‌ను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి, పక్కా ప్లాన్‌తో వారిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన ముగ్గురు కూడా పాత నేరస్తులేనని, వారిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరు ఒక పద్ధతి ప్రకారం చోరీలకు పాల్పడేవారని వెల్లడించారు. రోడ్లపై వెళ్లే ఒంటరి వ్యక్తులను ముందుగా లక్ష్యంగా చేసుకుని, ఒకరు ఫోన్ లాక్కుంటే, మరొకరు చుట్టుపక్కల ఎవరూ గమనించకుండా నిఘా ఉంచేవారు. గందరగోళం సృష్టించి అక్కడి నుంచి బైక్‌పై పరారవ్వడం వీరి నైజం.
ప్రస్తుతం అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రోడ్లపై నడిచేటప్పుడు , ఫోన్లలో మాట్లాడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
యూనివర్స్ బాస్ Chris Gayle మరో అడుగు.. ఆ జట్టుకు సహాయజమానిగా కొత్త ప్రయాణం..!
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!