యూనివర్స్ బాస్ Chris Gayle మరో అడుగు.. ఆ జట్టుకు సహాయజమానిగా కొత్త ప్రయాణం..!
- యూరప్ తొలి ఫ్రాంచైజీ లీగ్ యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్ (ETPL)
- ‘గ్లాస్గో ముగాఫియన్స్’ సహ యజమానిగా క్రిస్ గేల్
- లీగ్‌కు సహ యజమానిగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chris Gayle : యూరప్ లో మొదటి ఫ్రాంచైజీ ఆధారిత టి20 లీగ్ రూపుదిద్దుకోబోతుంది. ఈ క్రమంలో యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్ (ETPL) నిర్వహణ సంస్థ ‘గ్లాస్గో ముగాఫియన్స్’ (Glasgow Mugafians) అనే కొత్త ఫ్రాంచైజీని అధికారికంగా ప్రకటించింది. స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరాన్ని ప్రాతినిధ్యం వహించే ఈ జట్టు లీగ్ లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలవనుంది.
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఈ జట్టుకు వెస్టిండీస్ మాజీ కెప్టెన్, టి20 లెజెండ్ క్రిస్ గేల్ సహ యజమానిగా వ్యవహరించబోతున్నారు. ఆయనతో పాటు భారతీయ వ్యాపారవేత్త తాన్షా బాత్రా కూడా ఈ ఫ్రాంచైజీకి సహ యజమానిగా ఉండనున్నారు. సహా యజమానిగా మాత్రమే కాకుండా గేల్ ఈ జట్టుకు గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్ గా కూడా వ్యవహరించనున్నారు. ఫ్రాంచైజీ లాంచ్ సందర్భంగా గేల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. “కో-ఓనర్‌గా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక టి20 లీగ్‌లలో ఆడిన అనుభవంతో ETPL ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. మరోవైపు తాన్షా బాత్రా కూడా ఈ ఫ్రాంచైజీ ద్వారా స్కాట్లాండ్ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు.
యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్ (ETPL) అనేది ఐసీసీ ఆమోదం పొందిన యూరప్ తొలి టి20 ఫ్రాంచైజీ లీగ్. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈ లీగ్‌కు సహ యజమానిగా ఉన్నారు. క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఈ లీగ్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ లీగ్‌లో గ్లాస్గోతో పాటు అంస్టర్డామ్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, బెల్‌ఫాస్ట్, రోటర్‌డామ్ నగరాలకు చెందిన మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
ఇతర ఫ్రాంచైజీలకు కూడా ప్రముఖులు యజమానులుగా ఉన్నారు. అంస్టర్డామ్ జట్టుకు ‘స్టీవ్ వా’ యజమానిగా ఉండగా.. మిచెల్ మార్ష్ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బెల్‌ఫాస్ట్ జట్టుకు ‘గ్లెన్ మ్యాక్స్‌వెల్’ సహ యజమానిగా ఉండబోతున్నారు. ఎడిన్‌బర్గ్ జట్టుకు కైల్ మిల్స్, నాథన్ మెకల్లమ్ యజమానులు కాగా, మిచెల్ సాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ప్రపంచ క్రికెట్ ప్రముఖులు, కొత్త మార్కెట్లు కలిసివస్తున్న ఈ ETPL లీగ్.. భవిష్యత్తులో ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొత్త దిశను సృష్టించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!