Hyderabad: హైదరాబాద్ మహా నగరం ఇపుడు మరొక ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని మేటీ నగరాల్లో ఇప్పటికే చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మల్టీనేషనల్ కంపెనీలకు స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న హైదరాబాద్.. ఇపుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో చోటు సంపాదించింది. ప్రధానంగా బహుళజాతి సంస్థల ఉద్యోగుల నివాసానికి హైదరాబాద్ చాలా అనుకూలంగా ఉండనుంది.
Read also
రవాణా, నివాసం, ఆహారం, దుస్తులు, వినోదం, గృహోపకరణాలు తదితర 200 అంశాల ప్రాతిపదికన మెర్సర్ సంస్థ 2023 సంవత్సరానికి అత్యంత ఖరీదైన నగరాల ఎంపిక కోసం సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బహుళజాతి సంస్థల ఉద్యోగులకు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. మొత్తం 227 నగరాల్లో చేసిన సర్వేలో హైదరాబాద్‌కి 202వ స్థానం దక్కింది. ఇందులో భారత్ నుంచి మరొకొన్ని నగరాలకు కూడా ఇందులో చోటు దక్కింది. వాటిలో ముంబై 147, ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, కోల్‌కతా 211, పుణె 213 స్థానాల్లో నిలిచాయి. నివాస వ్యయం ముంబైతో పోలిస్తే చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పుణెలో 50 శాతం తక్కువని నివేదిక పేర్కొంది. భారత్‌లో విదేశీయులకు నివాస వ్యయం అత్యంత ఎక్కువుండే నగరం ముంబై అయితే.. తక్కువ ఉండే నగరం కోల్‌కతా అని సర్వేలో తేలింది. మరోవైపు విదేశీయులకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ టాప్–3లో ఉన్నాయి. జాబితాలో హవానా, కరాచీ, ఇస్లామాబాద్‌లకూ స్థానం దక్కినా కరెన్సీ విలువ పతనమే అందుకు కారణం.
Read also
విదేశాల్లో కార్యకలాపాలు సాగించాలని చూసే బహుళజాతి సంస్థలకు భారత్‌లో ముంబై, ఢిల్లీ నగరాలు ఉపయోగకరంగా ఉంటాయని మెర్సర్ నివేదిక తేల్చింది. తక్కువ జీవన వ్యయం, ఇతర ఖర్చులను దీనికి నేపథ్యంగా చూపింది. కాగా ఈ ఏడాది సర్వేలో ప్రవాసులకు ఆసియాలో అత్యంత ఖరీదైన టాప్ 35 నగరాల్లోనూ ముంబై, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. అయితే గత ఏడాది ముంబై 26వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 27కు పడిపోవడం గమనార్హం.