Fake Baba: పాతబస్తీలో చికిత్స నెపంతో నవ వధువుపై కపట బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని తలాబ్ కట్టా నివాసి హాజీతో మూడు నెలల క్రితం వివాహమైంది. అయితే వధువు ఆరోగ్యం కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణించింది. బాలిక ఆరోగ్యం విషమించడంతో అత్తమామలు ఆమెను బండ్ల గూడా ప్రాంతంలో నివసించే మజార్ బాబా వద్దకు తీసుకెళ్లారు. వధువు శరీరంపై ఐదు దయ్యాలు ఉన్నాయని అది వదిలించాలని లేదంటే ప్రమాదమని వధువు అత్త మామలకు నమ్మించాడు. దీంతో వారు భయపడి దయ్యాలను వదిలించాలని కోరారు. అయితే ఇదే అలుసుగా భావించిన నకిలీ బాబా అత్త మామలకు బయటనే ఉండమని చెప్పి నవ వధువును తీసుకుని ఓ గదిలో తీసుకుని వెళ్లాడు. ఆమెకు భయపడాల్సిన అవసరం లేదని ఏం జరిగినా అరవకూడదని చెప్పి వధువు కళ్లకు గంతలు కట్టి అనంతరం దొంగ బాబా బాలికపై అత్యాచారం చేశాడు. ఏమీ తెలియనట్లు దయ్యాలు వదిలించానని నమ్మించాడు. అత్తమామలు వధువును తీసుకుని ఇంటికి వచ్చారు.
Read also: Bunny: ఏకంగా ఇన్స్టాగ్రామ్ దిగొచ్చింది.. దేశంలోనే మొదటి హీరో… ఇది బ్రాండ్ అంటే
మానసిక ఆవేదనకు గురైన వధువు ఇంటికి వచ్చి తన భర్తకు, అత్తమామలకు విషయం చెప్పినా స్పందన లేకపోగా ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో10 బంధించారు. విషయం తెలుసుకున్న తల్లి.. కూతురు అత్తవారింటికి వెళ్లి ఇంటికి తీసుకొచ్చించి. ఏం జరిగిందని వధువును అడగడంతో విషయం అంతా చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే భవానినగర్ పోలీసులకు అత్యాచారం విషయంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి క్రైమ్ నం.0/2023లో సెక్షన్ 354BIPC(1)376 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు ఎందుకు చేయలేదని బాధితులు ప్రశ్నించగా .. కేసును బండ్లగూడ బదిలీ చేసినట్లు భవానీ నగర్ పోలీసులు చెప్పారు. అయితే ఫైల్ ఇంకా రాలేదని బండ్లగూడ పోలీసులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా మజార్ బాబాపై అత్యాచారం ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో బాలికను ఉరి తీస్తామని అత్తమామలు బెదిరించి నట్లు తెలిసింది. నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోయారని ఇన్‌స్పెక్టర్ బండ్ల గూడ ఇన్స్పెక్టర్ షాకీర్ అలీ తెలిపారు. ఒకవైపు పోలీసులు బాధితులను ఆదుకోవడం లేదని, ఇంకోవైపు అత్తమామలు బెదిరిస్తున్నారని బాలిక, ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Prema Deshapu Yuvarani: ‘ప్రేమదేశపు యువరాణి’ కోసం సునీత పాడిన సాంగ్ రిలీజ్