Hyderabd Metro : ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్ గుట్ట మెట్రో రైల్ కారిడార్ పనులు వేగవంతం
- ఎంజీబీఎస్-చంద్రాయన్‌గుట్ట మార్గంలో రోడ్ విస్తరణ వేగవంతం
- ఆస్తుల ప్రభావం తగ్గిస్తూ అలైన్మెంట్‌లో నూతన మార్పులు
- పిల్లర్ల మార్కింగ్, భూసామర్థ్య పరీక్షలకు సన్నాహాలు ప్రారంభం
- యుటిలిటీల మార్పు, అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్లపై సమన్వయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabd Metro : ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్‌గుట్ట మధ్య మెట్రో రైల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ విస్తరణ పనులు వేగవంతం అయ్యాయి. ఏడున్నర కిలోమీటర్ల మార్గంలో అలైన్మెంట్ అద్భుతంగా ఉండేలా చర్యలు చేపట్టామని, ఈ మార్గంలో రోడ్ విస్తరణ వల్ల ప్రభావితం అయ్యే ఆస్తుల సంఖ్యను తగ్గించేలా మార్గాన్ని రూపకల్పన చేశామని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
మెట్రో పనులకు సంబంధించి ఇంజినీరింగ్, రెవిన్యూ అధికారులతో రోజు వారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని అయన అన్నారు… ముందనుకున్న అంచనా ప్రకారం 1100 ఆస్తులు ఈ విస్తరణలో కూల్చవలసి ఉంటుందని భావించామని, కానీ ఎలైన్మెంట్ ను ఇంజనీరింగ్ నవకల్పన ద్వారా సరిదిద్దటం వల్ల ఆ సంఖ్య 900 వరకు తగ్గిందని ఆయన తెలిపారు. వీటిలో ఇప్పటికే 412 ఆస్తులకు సంబంధించిన అవార్డులు జరీ చేశామని, 380 ఆస్తుల కూల్చివేతలు ఇప్పటివరకు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు…
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
వీటి కోసం రు. 360 కోట్ల నష్టపరిహారం ప్రభావిత ఆస్తుల వారికి చెల్లించామని అన్నారు. ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ, కూల్చివేతలు చేసి అవశేషాలను తొలగించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించి పనులు ముమ్మరంగా చేపడుతున్నామని మెట్రో ఎండీ తెలిపారు. ఇక్కడ ఇళ్లు ఒకదానిని ఒకటి ఆనుకుని ఉండటం వల్ల, పైగా ప్రతి కట్టడానికి సంక్లిష్టమైన విద్యుత్ లైన్లు, ఇతర కేబుళ్లు వ్రేలాడుతూ ఉండడంతో వాటిని చాలా అప్రమత్తంగా తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు..
సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అర్థరాత్రి సమయాల్లో విస్తరణ పనులు ముమ్మరంగా చేస్తున్నామని ఆయన చెప్పారు. మిగిలిన ఆస్తుల స్వాధీనానికి మరియు త్వరితగతిన కూల్చివేతలు పూర్తిచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు ఆయన వెల్లడించారు.
Gowtham Tinnanuri : రామ్ చరణ్ తో మూవీ అందుకే చేయలేదు
మరో వైపు మెట్రో నిర్మాణ పనులు ప్రారంభించడానికి వీలుగా చర్యలు చేపట్టామని మెట్రో ఎండీ తెలిపారు. ఈ కారిడార్ లో వచ్చే పిల్లర్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించి వాటిని మార్కింగ్ చేసే పని ప్రారంభం అయిందని ఆయన తెలిపారు. వయాడక్ట్ ను నిలిపే పిల్లర్ల మధ్య 25 మీటర్ల (సుమారు 82 అడుగులు) దూరం ఉంటుందని ఆయన చెప్పారు. మెట్రో స్తంభాలు, స్టేషన్లు వచ్చే చోట భూసామర్థ్య పరీక్షల కోసం ఏజెన్సీని నియమించామని, త్వరలో భూసామర్థ్య పరీక్షలు కూడా చేపడతామని ఆయన వెల్లడించారు.
చారిత్రక, ఇతర సున్నిత కట్టడాలకు అంతరాయం కలగకుండా, పిల్లర్ మరియు మెట్రో స్టేషన్ల స్థానం నిర్ణయించేందుకు DGPS సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు. నిర్మాణ సమయంలో సర్వే సులభంగా జరిగేలా భూమిపై తాత్కాలిక బెంచ్ మార్క్ (TBM) లొకేషన్లు నిర్ణయించినట్టు ఆయన స్పష్టం చేశారు. పిల్లర్లు, స్టేషన్లు వచ్చే ప్రాంతాల్లో భూగర్భ మరుగునీటి లైన్లు, మంచినీటి లైన్లు, వరదనీటి డ్రైన్లు, పైన వేలాడే విద్యుత్ లైన్లు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ లేబుళ్లు గా మారుస్తామని తెలిపారు.
ఇందుకోసం వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, టీజీఎస్పీడీసీఎల్ విభాగాల నుండి వచ్చే కొద్ది రోజుల్లో అంచనాలు సమర్పించవలసిందిగా కోరామని ఆయన చెప్పారు. ఆయా శాఖల అధికారులతో మెట్రో అధికారులు రేయింబవళ్లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ ముఖ్యమైన యుటిలిటీస్ ని గుర్తించే పని చేపట్టారని ఎన్ వి ఎస్ రెడ్డి తెలిపారు.
Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!