Site icon NTV Telugu

Theft : హైదరాబాద్‌లో రోజు రోజుకు పెరుగుతున్న చోరీలు

Theat

Theat

Theft : ఒకే రోజు.. మూడు చోరీలు… పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. కానీ పోలీసులు మాత్రం ఊరికే ఊరుకుంటారా..? జస్ట్ 24 అవర్స్‌లో ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కటకటాల్లోకి నెట్టారు. ఇది హైదరాబాద్ మలక్‌పేట్ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్‌లో రోజు రోజుకు చోరీలు పెరుగుతున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు..

మలక్‌పేట్ ప్రాంతంలో ఒకే రోజు మూడు చోరీలు జరిగాయి. దీంతో ఈ చోరీలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ మూడు చోరీలు కూడా ఢిఫరెంట్ స్టైల్‌లో జరిగాయి. కారు డిక్కీలో ఓ వ్యక్తి డబ్బు చోరీ చేశాడు. మరో ఘటనలో స్కూటర్ డిక్కీ నుంచి డబ్బు, చెక్ పుస్తకాలు కొట్టేశాడు మరో వ్యక్తి. ఇక ఓ సెల్‌ఫోన్ షోరూమ్‌ గోడకు రంధ్రం చేసి మరీ లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లు ఎత్తుకుని పారిపోయాడు ఓ దొంగ..

ఇక్కడ చూడండి.. బురఖాలో ఉన్న ఇతని పేరు మహమ్మద్ వాజిద్‌. గతంలో మలక్‌పేట్ గంజ్‌లో ఉల్లిపాయ వ్యాపారి షేక్ ఖుద్దూస్ వద్ద పని చేసి మానేశాడు. ప్రస్తుతం టాటా ఏస్ డ్రైవింగ్ చేస్తున్నాడు. రియాసత్ నగర్ ఓవైసీ కాలనీకి చెందిన వాజిద్.. బురఖా ధరించి వచ్చి స్కూటర్ డిక్కీలో దాచి ఉంచిన 6.50 లక్షల నగదుతోపాటు చెక్ బుక్ ఎత్తుకుని వెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ, కార్మికులు ఇచ్చిన ఆధారాల ఆధారంగా కేసు ఛేదించారు పోలీసులు. మహమ్మద్ వాజిద్‌‌ని నిందితుడిగా గుర్తించారు. అతని నివాసం నుంచి అరెస్టు చేశారు. ఆర్థిక సమస్యలు, కారు కొనాలనే కోరిక కారణంగా నిందితుడు దొంగతనం చేశాడని విచారణలో తేలింది…స్పాట్..

ఇక్కడ చూడండి.. ఇది దిల్‌సుఖ్ నగర్‌లోని బిగ్ సీ సెల్‌ఫోన్ షో రూమ్. ఈ గోడకు రంధ్రం చేసి.. అర్ధరాత్రి దొంగ లోపలికి ప్రవేశించాడు. లక్షల రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకుని పోయాడు. అతడు చోరీ చేసిన సమయంలో సీసీ కెమెరాలు ఆన్‌లోనే ఉన్నాయి. వాటిల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా అతన్ని రంజన్ దాస్‌గా గుర్తించారు పోలీసులు. మద్యానికి బానిసయ్యాడు. అతనికి ఇల్లు లేదు. నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఫుట్ పాత్‌పై నివసిస్తున్నట్లు గుర్తించారు. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికతో చోరీలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు.. స్పాట్..

డీసీపీ చైతన్య కుమార్ మాట్లాడుతూ.. ఆర్ధిక అవసరాలు, జల్సాలు.. విలాసవంతమైన జీవితం కోసం ఎవరు దొంగతనం చేసినా అది నేరమే అవుతుంది. అలాంటి హైఫై జీవితం గడపాలంటే కష్టపడి డబ్బు సంపాదించాలి తప్ప ఇలాంటి నేరాలకు అలవాటు పడితే జైలులో జీవితం గడపాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్నారు..

Poonam Kaur: మరోసారి త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన పూనమ్

Exit mobile version