Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత క్రూరమైన ఘటన వెలుగుచూసింది. గత ఆరు నెలలుగా తనతో కలిసి లివిన్స రిలేషన్ సాగిస్తున్న ఒక 50 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడు నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో తీవ్ర ఆవేశానికి లోనై, చాకుతో ఆమె నాలుకను కోసి పారిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సదరు మహిళ భర్త పదేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఆరు నెలల క్రితం నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారడంతో, ఇద్దరూ పరస్పర అంగీకారంతో గత ఆరు నెలలుగా ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య కొన్ని వ్యక్తిగత విషయాలపై మనస్పర్థలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న అర్ధరాత్రి దాటిన తర్వాత నవీన్, సదరు మహిళ మధ్య ఇంట్లో గొడవ మొదలైంది. మాట మాట పెరిగి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన నవీన్ ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే పదునైన చాకును తీసుకుని ఆమెపై దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను గట్టిగా పట్టుకుని చాకుతో ఆమె నాలుకను కోసేశాడు. మహిళ గట్టిగా కేకలు వేస్తూ రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో నిందితుడు నవీన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. స్థానికులు, పొరుగువారు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి సికింద్రాబాద్లోని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గాంధీ ఆసుపత్రి వైద్యుల బృందం ఆమెకు అత్యవసర సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం బాధిత మహిళ ఐసీయూలో చికిత్స పొందుతూ నిలకడగా కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..