NTV Telugu Site icon

Raj Gopal Reddy: సంచలన వ్యాఖ్యలు..! రేవంత్ వెనక సీమాంద్రా పెట్టుబడి దారులు..?

Revanth , Rajagopalredy

Revanth , Rajagopalredy

రేవంత్ వెనక సీమాంద్రా పెట్టుబడి దారులు వున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్‌ పని చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకునే చచ్చి పోయిందని అన్నారు. రేవంత్ నీ నడిపిస్తున్నది చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. విభజన హామీలు మెల్లగా నేర వేరుస్తారని, సంబరాలు జరిపిన వెంకట్ కి ఎన్ని ఓట్లు వచ్చాయని మండిపడ్డారు. మహేష్ గౌడ్ నా దిష్టి బొమ్మ దగ్దం చెయ్ అంటున్నారు. 12 మంది ఎమ్మెల్యే లు పార్టీ మారినప్పుడు ఏం పీకారు అంటూ మండిపడ్డారు. భట్టి, రేవంత్ ఏం చేశారు ఎమ్మెల్యే లు పోతే అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నీ అడ్డం పెట్టుకొని వేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రేవంత్ కాంగ్రెస్ నీ నాశనం చేస్తాడని విమర్శించారు. రేవంత్ నాయకత్వంలో 9 ఎమ్మెల్యేలు గెలుస్తారు, పొన్నాల హయాంలో 21, ఉత్తమ్ హయంలో 19 ఎమ్మెల్యేలు గెలిచిందని అన్నారు. రేవంత్ హయంలో సింగిల్ డిజిట్ వస్తోందని అన్నారు. చంద్ర బాబు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు చేరావు? ప్రశ్నించారు. రాహుల్ ..సోనియా గాంధీ లను ప్రాణం పోయినా విమర్శ చేయనంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

read also: Andhra Pradesh: ప్రేమించలేదని దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టిన ఉన్మాది..

బీజేపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ నుండి నాలుగో పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవ చేసారు. రేవంత్‌ నీకు వ్యక్తిత్వం ఉందా? అంటూ ప్రశ్నించారు. జైల్ కి ఎందుకు పోయావు? తెలంగాణ ఉద్యమంలో జైల్ కి పోయావా? అంటూ ప్రశ్నించారు. ఆర్‌టీఐ కింద దరఖాస్తూ పెట్టీ డబ్బులు వసూలు చేసింది నువ్వు కాదా? అంటూ విమర్శించారు. వ్యాపారం లేకుండా డబ్బులు ఎట్లా సంపాదించావు అంటూ ప్రశ్నించారు. మేము వ్యాపారం చేశాము, మా బ్రాండ్ ఇమేజ్ మానవత్వంతో ఆడుకున్న రేవంత్ బ్రాండ్ బ్లాక్ మైలర్ అంటూ నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుల ముసుగులో బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్త లెక్క ఆత్మగౌరవం చంపుకుని పని చేయమని అన్నారు. రేవంత్‌కు చరిత్ర లేదు, దొంగవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చరిత్ర లేని మనిషి రేవంత్ అంటూ తీవ్రంగా విమర్శించారు. కాంట్రాక్ట్ కోసమే పార్టీ నుండి మారినట్టు నిరూపించు, నీరూపించక పోతే పీసీసీ కి రాజీనామా చెస్తావా అంటూ సవాల్‌ విసిరారు. రేవంత్ నిరూపిస్తే… నేను రాజకీయ సన్యాసం తీసుకుంట అంటూ అంటూ రేవంత్ కి సవాల్ విసిరారు రాజగోపాల్‌ రెడ్డి.
Raj Gopal Reddy: రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సవాల్.. మునుగోడులో గెలిచేది నేనే..!