Hyderabad Rains : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హయత్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో తీవ్ర ఆందోళన నెలకొంది. వరద నీటి ధాటికి ఒక ఇంటి పునాది కొట్టుకుపోగా, దాని పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభం భవనంపైకి వరిగిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనలో గడుపుతున్నారు. సంఘటన వివరాల్లోకి వెళ్తే, కాలనీలో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైపు వరద తాకిడికి పగిలిపోయింది. ఆ పగిలిన పైపు నుండి వెల్లువెత్తిన వరద నీరు పద్మావతి కాలనీలోని ఒక ఇంటి పునాదిని పూర్తిగా కొట్టుకుపోయింది. పునాది బలహీనపడటంతో, ఆ భవనం నెమ్మదిగా ఒక పక్కకు ఒరుగుతూ ప్రమాదకరంగా మారింది.
Cyber Crime : ఒక్క వీడియో కాల్.. మొత్తం జీవితం తలకిందులు.!
ఈ భవనం పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభం కూడా నేల క్రుంగి, ఆ భవనంపైకి వరిగిపోయింది. ప్రస్తుతం ఆ విద్యుత్ స్తంభం భవనం నుంచి ఒక ఇంటికి ఉన్న కనెక్షన్ వైరు ఆధారంగానే వేలాడుతోంది. కరెంటు స్తంభం బరువుకు ఏ క్షణమైనా ఆ వైరు తెగిపోయి, భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు.
ఇంటి పునాది బలహీనపడటం, దానిపై విద్యుత్ స్తంభం వరిగి ఉండటంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగే ముందు అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రమాదకరంగా ఉన్న భవనం, విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Tadipatri: తాడిపత్రిలో మరోమారు టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసు బందోబస్తు!