BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
- బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్‌కు హైదరాబాద్ వేదిక
- 14 దేశాల నుంచి 50 మంది అంతర్జాతీయ ప్రతినిధులు
- ఉపాధి, AI, సామాజిక భద్రతపై కీలక చర్చలు
- మూడు రోజుల పాటు హోటల్ మారియట్‌లో సదస్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS Trade Unions Summit : అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ (BRICS) దేశాల ట్రేడ్ యూనియన్స్ ఫోరమ్ సమ్మిట్‌కు ఈసారి భాగ్యనగరం వేదిక కానుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన సమ్మిట్ సచివాలయాన్ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్రముఖ ‘హోటల్ మారియట్’లో ఈ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ సదస్సుకు బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, సౌత్ ఆఫ్రికా సహా సుమారు 14 దేశాల నుంచి 50 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, అలాగే మన దేశం నలుమూలల నుంచి దాదాపు 70 మంది జాతీయ కార్మిక సంఘాల అగ్రనేతలు హాజరు కానున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కార్మిక, సాంకేతిక రంగాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు రోజుల సమ్మిట్‌లో ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరపనున్నారు. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు పని విధానంతో పాటు అట్టడుగు వర్గాల కార్మికులకు సైతం సామాజిక భద్రత కల్పించడంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. వీటితో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పని ప్రపంచానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించడం , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి మానవ కేంద్రీత సాంకేతికత మానవాళికి ఏ విధంగా సహాయకారిగా ఉపయోగపడాలనే అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!