Hyderabad: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. కఠిన నిర్ణయం తీసుకున్న భర్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దంపతుల మధ్య గొడవలు మామూలే. గొడవలు లేకుండా కాపురం ఉండదని పెద్దలు అంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం సమాజంలో ప్రతి ఇంట్లో జరిగే సాధారణ సంఘటన. అసలు అలలు, గిల్లికజ్జాలు లేకుండా సంసారం సుఖంగా ఉండదని కూడా అంటారు. ఎన్ని గొడవలు వచ్చినా 10 నిమిషాలు కూర్చుని మాట్లాడితే సమస్యలు తీరతాయనేది వాస్తవం. ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని జంటలు విచక్షణ కోల్పోతారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలనే పెద్ద విషయంగా తీసుకుని క్షణికావేశానికి లోనవుతున్నారు. వీరి గొడవలు పచ్చి సంగతులను నాశనం చేస్తూ.. విడాకుల వరకు వెళ్తున్నాయి. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల.. ఇంట్లో జరిగిన చిన్న గొడవతో ఓ యువతి భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: YS Rajasekhara Reddy: వైఎస్‌కు గవర్నర్ నివాళి.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
రాజమహేంద్రవరానికి చెందిన రాజారావు కుటుంబం నగరానికి వలస వచ్చి జూబ్లీహిల్స్‌లో ఉంటోంది. అతని కుమారుడు రామచంద్ర (30) సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రామచంద్రకు 9 నెలల క్రితం వివాహమైంది. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. చిన్న గొడవ జరిగినా అది చిలికి చిలికి గాలివాన అయ్యేది. అయితే అది గొడవలు 9 నెలల వరకు కొనసాగుతూనే వచ్చాయి. గొడవలతో విసిగి పోయిన భార్య అతడిని వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. గత మూడు నెలలుగా అత్తాపూర్ పరిధిలోని మారుతీనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. భార్యను తనవద్దకు రావాలని కోరేవాడు. అయితే భార్య రాలేనని కలాఖండిగా చెప్పేసింది. దీంతో భార్య వదిలేసి వెళ్లిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అటు భార్య దగ్గర లేక, ఇట్టు మనస్తాపంతో తీవ్ర ఆలోచనతో గడపలేకపోయాడు. చావే సరణ్యమని భావించి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు తన భార్య వెళ్లిపోయిందని, రామచంద్ర చివరిగా ఎవరితో మాట్లాడు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ప్రెగ్నెన్సీలో వాంతులు.. పరిష్కారానికి చిట్కాలు
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!