Wife and Husband: నా భార్య అలిగి వెళ్లిపోయింది.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త
- అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయిన భార్య
- విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త
- స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ ఆందోళన
- సైదాబాద్ సింగరేణి కాలనీలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife and Husband: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ మాత్రమే కాదు సహనంలో సీతగా కూడా భార్యకు చాలా మంచి స్థానం ఉంది. అటువంటి భార్య..భర్తల వైవాహిక జీవితంలో అన్నీ అడ్డంకులే. ఎవరు ఏమనుకున్నా అలగడం, లేక ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా చంపేయడం ఇటువంటివి మనం రోజూ చూస్తున్నాము. భార్య భర్తల జీవితాల్లో సర్దకు పోవాలి అనే మాట కరువైంది. సర్దుకుని సంసారం చేసేందుకు ఇద్దరి మనోభావాలు అడ్డుగా వస్తున్నాయి. నువ్వెంత అంటే నేనింతే అనే మాటలు, మాటల తూటాల్లా సంసారంలో పేలుతున్నాయి.
ఒకొరినొకరు అర్థం చేసుకునే రోజులు పోయి. చీటికి మాటికి అలగడం, మాట్లాడుకోకుండా జీవితాలను చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే రోజులు పోయి అక్రమ సంబంధాలు, కేసులు, ఆత్మహత్యలు, దాడులు చేసుకునే రోజులు వస్తున్నాయి. అంతేకాదు భర్త తిట్టిన కొట్టిన భార్య సర్దుకుని సంసారం చేస్తే అది ఎనలేని వీడని బంధం అవుతుంది. ఇది నేరమే అయినా సంసారం సాఫీగా జరగాలంటే ప్రేమతో కొట్టిన, తిట్టినా అదే అలుసుగా తీసుకుని భర్త పై భార్య, భార్యపై భర్త అలగడం, గొడవ పడటం ఇప్పుడు ఫ్యాషన్ గా మారుతుంది. అయితే ఓ మహిళ భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో కోపంతో భర్త విద్యుత్ స్తంబం ఎక్కిన ఘటన సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది.
Also Read
- MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
Read also: Arunachal Pradesh cm: అరుణాచల్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ.. వరుసగా మూడోసారి ( వీడియో)
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు, తన భార్యతో నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులు అన్యోన్యంగా సాగిన వీరిజీవితంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. మద్యానికి బానిసైన మోహన్, తన భార్యతో రోజూ గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య.. భర్త మోహన్ పై ఆగ్రహం వ్యక్తం చేసేది. దీంతో భర్త మోహన్ కు భార్యకు చిన్నపాటు గొడవైంది. మోహన్ మద్యానికి బానిసై రోజూ ఇంటికి తాగిరావడంతో విసుగు చెందిన భార్య అలిగి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యం మత్తులో వున్న మోహన్ బాబు.. స్థానిక కాలనీలోని శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు.
మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. దీంతో స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులకు మద్యం బాబు గంటన్నర పాటు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. ఇతడు రెండేళ్లలో ఐదుసార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కుతాడని, భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులే చేస్తాడని స్థానికులు పోలీసులకు తెలిపాడు.
NEET-UG 2024: నీట్ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ..
తాజావార్తలు
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..