Regina Cassandra Accepted Green India Challenge: ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి ప్రగ్యా జైస్వాల్ ఇచ్చిన ఛాలెంజ్‌ను నటి రెజీనా కెసాండ్రా స్వీకరించింది. తాను నటించిన శాకిని డాకిని సినిమా నిర్మాత సునీతతో కలిసి.. శిల్పరామం రాక్ పార్క్ ఆవరణలో మొక్కలు నాటింది. అనంతరం మాట్లాడుతూ.. ప్రగ్యా ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరిస్తూ, తాము రెండు మొక్కలు నాటామని తెలిపింది. ఇంతటి గొప్ప గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో తనకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది.
దేశంలో పచ్చదనం పెరగాలని ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి.. అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారని చెప్పింది. ఈ ఛాలెంజ్‌లో అందరూ భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందని.. తమకు ఎంతో ఇష్టమైన పారిజాతం, వేప మొక్కలను నాటడం మనసుకు ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంది. ఒక చైన్‌లా కొనసాగుతున్న గ్రీన్ఇండియా చాలెంజ్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని, రేపటి తరాలకు మంచి ఆక్సిజన్ అందేవిధంగా మొక్కలు నాటాల్సిందిగా కోరింది. అదే విధంగా ఈ ఛాలెంజ్‌లో మొక్కలు నాటాల్సింది నివేదా థామస్‌ను రెజీనా కోరగా.. శ్రీ సింహ, కాళ బైరవలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ సునీత నామినేట్ చేసింది.
కాగా.. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన శాకిని డాకిని సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. డి. సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్ వూ థామస్ కిమ్ కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. ఇది కొరియన్ సినిమా మిడ్‌నైట్ రన్నర్స్‌కి రీమేక్. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి ఆదరణ లభించింది.