Hit and Run: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై హిట్ అండ్ రన్.. ఇద్దరు యువకులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hit and Run: కొందరు యువత సెల్ఫీల కోసం ప్రమాదకర పనులు చేస్తుంటారు. కొంత మంది లైక్స్ రావడానికి.. ఫేమస్ కావడానికి రీళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలో ఓ కారు వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం శుక్రవారం మాదాపూర్‌లో చోటుచేసుకుంది. అనిల్ , అజయ్ లు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో రోడ్డుపైకి వచ్చే వాహనాలను పట్టించుకోలేదు. అర్ధరాత్రి 12.30 గంటలకు కేబుల్ వంతెన వద్దకు చేరుకున్నారు.
Read also: Sneha Ullal : హారర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్నేహా ఉల్లాల్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న సీన్స్…
Also Read
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
ఈ క్రమంలో AP28DV7999 ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మాదాపూర్ పేస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే అనిల్ మృతి చెందాడు. చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కేబుల్ వంతెనపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేబుల్ బ్రిడ్జిపై ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, సెల్ఫీలు దిగే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Top Headlines @1PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!