NTV Telugu Site icon

Hit and Run: దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ పై హిట్‌ అండ్‌ రన్‌.. ఇద్దరు యువకులు మృతి..

Kabul Bridz

Kabul Bridz

Hit and Run: కొందరు యువత సెల్ఫీల కోసం ప్రమాదకర పనులు చేస్తుంటారు. కొంత మంది లైక్స్ రావడానికి.. ఫేమస్ కావడానికి రీళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలో ఓ కారు వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం శుక్రవారం మాదాపూర్‌లో చోటుచేసుకుంది. అనిల్ , అజయ్ లు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో రోడ్డుపైకి వచ్చే వాహనాలను పట్టించుకోలేదు. అర్ధరాత్రి 12.30 గంటలకు కేబుల్ వంతెన వద్దకు చేరుకున్నారు.

Read also: Sneha Ullal : హారర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్నేహా ఉల్లాల్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న సీన్స్…

ఈ క్రమంలో AP28DV7999 ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మాదాపూర్ పేస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే అనిల్ మృతి చెందాడు. చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కేబుల్‌ వంతెనపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేబుల్ బ్రిడ్జిపై ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, సెల్ఫీలు దిగే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Top Headlines @1PM : టాప్ న్యూస్