NTV Telugu Site icon

TS High Court: పోడు భూముల పట్టాల పంపిణీపై స్టేకు హైకోర్టు నిరాకరణ

Ts High Court

Ts High Court

TS High Court: ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న పోడు భూములకు పట్టాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే.. పోడు భూములకు పట్టాల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా..పోడు భూముల క్రమబద్ధీకరణ చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రెసిడెంట్‌ పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. కాగా.. పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే.. పోడు భూముల క్రమబద్దీకరణ జరగాలంటే ఆదివాసీల అటవీ హక్కుల చట్టం, నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో.. పోడు భూములను క్రమబద్ధీకరించడం చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడుతోంది. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇకపై ఈ భూముల క్రమబద్దీకరణ చేయడం అనేది సుప్రీంకోర్టు తీర్పునకు సైతం ప్రభుత్వ మెమో విరుద్ధంగా ఉందని లాయర్ వాదించారు. ఇక.. మరోవైపు సాగు చేసుకుంటున్న వారికే పోడు భూముల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ములుగు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త కె. శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ పిటిషన్‌ వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోకూడదని.. సాగు చేసుకుంటున్న వారికి పోడు భూమి పట్టాలు ఇచ్చేలా సమర్థించాలని కోర్టును శ్రవణ్ కుమార్ కోరారు.

Read also: Warangal Crime: వైద్యం ముసుగులో క్షుద్రపూజలు.. హనుమకొండలో ఇద్దరు నకిలీ డాక్టర్స్ అరెస్ట్

అంతేకాకుండా.. అడవులు, పోడు భూములపై ఆధారపడిన గిరిజనులకు ప్రయోజనాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావించడం ఆదివాసీల అటవీ హక్కుల చట్టం ఉద్దేశమని శ్రవణ్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. కాగా.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, శ్రవణ్ కుమార్ తరఫు లాయర్ వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం పోడు భూముల పట్టాల పంపిణీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 22కి వాయిదా వేసింది. అయితే.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
తెలంగాణలో లక్షలాది కుటుంబాలు పోడు భూములపై ​​ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆ భూమిపై ఆదివాసీలు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. తెలంగాణలో కూడా దాదాపు 10 జిల్లాల్లో పోడు భూములున్నాయి. ప్రభుత్వం హరితహారం పథకాన్ని తీసుకొచ్చి అటవీ భూముల్లో మొక్కలు నాటుతోంది. అయితే.. దీని వల్ల అటవీ అధికారులు, ఆ ప్రాంతంలోని గిరిజనులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఇక గత ఏడాది పోడు భూముల పరిరక్షణకు వెళ్లిన ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.. పోడు భూముల వివాదం నేపథ్యంలో వలస దారులు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందాడు.
India vs Australia ODI: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ఆఫ్‌లైన్‌లో విశాఖ వన్డే టికెట్లు