ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న పోడు భూములకు పట్టాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే.. పోడు భూములకు పట్టాల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా..పోడు భూముల క్రమబద్ధీకరణ చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.