దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో బాధితురాలి తరపు న్యాయవాది బృందా గ్రోవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలి తరపున వాదిస్తున్న కేసుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
కరోనా కేసుల విజృంభణ మళ్లీ కొనసాగుతుండడంతో.. అంతా ఆన్‌లైన్ బాట పడుతున్నారు.. ఇప్పటికే ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో.. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ్టి నుంచే ఆన్‌లైన్ బోధనను తిరిగి ప్రారంభించాయి.. మరోవైపు.. న్యాయస్థానాల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో వెంటనే అన్ని కేసులను ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది..…