TS Heavy Rains: వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలే.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Heavy Rains: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈరోజు వాయువ్యానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 14న జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: CM JAGAN: ల్యాండ్ అయిన జగన్.. వైసీపీ నేతలు ఘన స్వాగతం
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఈశాన్య రుతుపవనాలు యథావిధిగా దక్షిణ భారతదేశం వైపు మెల్లగా కదులుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కానీ బంగాళాఖాతంలో మయన్మార్ దగ్గర వాయుగుండం ఏర్పడిందని.. రెండు రోజుల్లో అల్పపీడనంగా మారనుందని చెప్పారు. ఆ తర్వాత మబ్బుగా మారే అవకాశం కూడా ఉంది… తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 30.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని తెలిపారు. 24 డిగ్రీల సెల్సియస్ మరియు 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మరో రెండు, మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు. అడపాదడపా వర్షాలు తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
Read also: India Vs Pakistan: పాకిస్థాన్‌పై ఘన విజయం.. చరిత్ర సృష్టించిన భారత్!
ఏపీలో 21 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి ఉన్న షీర్ జోన్ (ద్రోణి) నేడు బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఈరోజు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా ఉంటుంది.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 11వ తేదీ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలపై బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా , విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి.సాయంత్రం సమయంలో విశాఖపట్నంలో 100% ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
Astrology: సెప్టెంబర్ 12, మంగళవారం దినఫలాలు
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!