Heavy rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy rain: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరు జల్లులతో పలుకరించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఖైరతాబాద్, కేపీహెచ్‌బీ, దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా నగరం నీట మునిగింది. రాగల 3 రోజులు గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 40°C నుండి 43 °C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
భారత వాతావరణ శాఖ (IMD) హర్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 3-4 రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉంది. అరేబియా సముద్రం నుండి తేమ కారణంగా ఇవాళ,రేపు (మే 28-29) తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని, వాయువ్య భారతదేశంలో ఇదే విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 5 రోజుల పాటు వాయువ్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య యూపీలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, ఈశాన్య రాజస్థాన్, యూపీలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ సోమా సేన్ రాయ్ తెలిపారు.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
ఢిల్లీలో వర్షాలు
అంతకుముందు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పు ఉత్తర భారతదేశంలో ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తోంది. మే 27న కూడా ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వర్షం మరియు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
Fake IT Raid: ఐటీ అధికారులుగా నటించి 2.5 కేజీల బంగారం చోరీ.. దర్యాప్తుకు 6 ప్రత్యేక బృందాలు
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!