దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ చీఫ్ కె నాగరత్న తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏ రోజైనా అభివృద్ధి గురించి ఆలోచించారా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఫైర్
శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 33 జిల్లాల్లో కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరియు బలమైన గాలులు కూడా సంభవించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: బర్త్ డే రోజు ఈడీ షాక్.. లిక్కర్ కేసులో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
జూలై 22 వరకు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో రాయలసీమ, లక్షద్వీప్‌లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
