Heavy Rain: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం దాదాపు గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా, సికింద్రాబాద్, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘాట్ ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా బయటకు వచ్చిన వారంతా భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Kishan Reddy: వెంకయ్య గ్రామంలో అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు పైనే మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి చేరిన నీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం కూడా ట్రాఫిక్ సమస్యకు మరో కారణమైంది.