NTV Telugu Site icon

Hyderabad Rains: హైదరాబాద్‌ లో దంచికొడుతున్న భారీ వర్షం..

Hyderabad Rains

Hyderabad Rains

Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది.. ఇక, నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతుంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, శ్రీనగర్ కాలనీ, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అటు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, సూరారం, గాజులరామారం, బషీర్ బాగ్, నారాయణగూడ, బహదూర్ పల్లి, చింతల్, అబిడ్స్, కోఠి, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక పంజాగుట్ట, కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాల్లోనూ మోస్తారు వర్షం పడుతుంది. మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయింది. దీంతో రానున్న రెండు మూడు గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించింది.

Read Also: Rats Poison Spray: హాస్టల్‌లో ఎలుకల మందు స్ప్రే చేయడంతో స్పృహ కోల్పోయిన 19 మంది విద్యార్థులు..

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతుండటంతో.. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలు దేరే సమయం కావటంతో మరింత ట్రాఫిక్ జాం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆఫీసుల నుంచి ఒకేసారి బయటకు రావొద్దని.. నిదానంగా.. టైం తీసుకుని రోడ్డు మీదకు రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.. అలాగే పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
East Godavari: వృద్ధుల ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు