BRS vs Congress : హత్నూరలో కాంగ్రెస్-బీఆర్ఎస్ బాహాబాహీ..
- సంగారెడ్డి హత్నూరలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
- రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
- అదేసమయంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు
- ఇది ప్రభుత్వ కార్యక్రమమా..? అధికారిక కార్యక్రమమా..? అని వారించిన ఎమ్మెల్యే సునీత
- రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని చింపివేసేందుకు ప్రయత్నించిన BRS కార్యకర్తలు
- ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS vs Congress : సంగారెడ్డి జిల్లా హత్నూరులో శుక్రవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జరగడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది.
Also Read
“ప్రభుత్వ పథకాల పంపిణీ వేదికను రాజకీయ ప్రచార వేదికగా మార్చడం సమంజసం కాదు. ఇది అధికారిక కార్యక్రమమా, లేక పార్టీ కార్యక్రమమా?” అని ప్రశ్నించారు.
IND vs ENG: జైస్వాల్‌కు బయపడి.. అంపైర్‌కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్!
ఈలోగా, అక్కడికొచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని చింపివేయడానికి ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలను సభా ప్రాంగణం నుండి బయటకు పంపి పరిస్థితిని నియంత్రించారు. అయితే ఘర్షణతో కార్యక్రమం తాత్కాలికంగా అంతరాయం కలిగింది.
ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు నమోదు చేసుకున్నాయి. ఇటీవల నర్సాపూర్ నియోజకవర్గంలో వరుసగా రాజకీయ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మరింత చర్చనీయాంశమైంది.
PM Kisan Yojana: పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమ కాలేదా..? అయితే ఇలా చేయండి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..