వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం పై తీవ్ర ఆరోపణలు చేసారు. మెగా కృష్ణారెడ్డి రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని.. ఇందుకు సంబంధించి రూ.12వేల కోట్ల GST కట్టాల్సి ఉంటుందని స్వయంగా GST ఇంటెలిజెన్స్ చెబుతున్నా.. KCR ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీ ఇద్దరు తోడు దొంగలేనా? అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు? అని ప్రశ్నంచారు. మా తెలంగాణ వాళ్ళకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా? లేక ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా? అంటూ ఎద్దేవ చేసారు. ఈ విషయంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? మెగా కృష్ణారెడ్డి మీకు కూడా దోస్తు కాబట్టి, మీకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి మాట్లాడటం లేదా? అంటూ వైఎస్ షర్మిళ మండిపడ్డారు.
మెగా కృష్ణారెడ్డి రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని.. ఇందుకు సంబంధించి రూ.12వేల కోట్ల GST కట్టాల్సి ఉంటుందని స్వయంగా GST ఇంటెలిజెన్స్ చెబుతున్నా KCR ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.మీ ఇద్దరు తోడు దొంగలనా? రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే
1/2 pic.twitter.com/eRqG7rkLy9— YS Sharmila (@realyssharmila) July 23, 2022
భద్రాద్రి వరదల పట్ల ముందస్తు హెచ్చరికలు చేయక పోవడం వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలు తీవ్రనష్టం చవిచూశాయని షర్మిల మండిపడ్డారు. ఇల్లు, వాకిలి వదిలి కట్టుబట్టలతో ఉన్న నిర్వాసితులకు ప్రభుత్వం చేసిన సాయం ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వరద బడుతులకు తినడానికి వీలు లేని బియ్యాన్ని ఇచ్చారు.. బాధితులు తమ గోడును లెల్లబోసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇల్లు పంటలు అంతా నష్టమే.. సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చి పోయారు.. హామీలు ఇచ్చారు నేటి వరకు ఏ సాయము ప్రజలకు అందలేదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకుంటే బాధితులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఇల్లు, పంట, జీవనోపాధి అన్ని ఆర్ధిక నష్టాలే.. బాధిత ప్రజల గోస చెప్పలేనిదని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు.
ఈనేపథ్యంలో.. నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం..మరిచి పోవడమే కేసీఆర్ కు తెలుసని విమర్శించారు. శనివారం పినపాక మండలం రావి గూడెం గ్రామంలో పర్యటించిన షర్మిల గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించిన ఆమో మాట్లాడుతూ… గతంలో వరంగల్, ఖమ్మం రైతులను ఇలానే మోసం చేశారని మండిపడ్డారు. ఫామ్ హౌజ్‌లో పడుకుంటారని దుయ్యబట్టారు. వానలతో .. వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారన్నారు. ప్రజలకు తక్షణ సహాయం చేయలేని ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు అంటూ షర్మిళ ప్రశ్నించారు. మీకు పరిపాలన చేతకాక పోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయండని మండిపడ్డారు. మీరు ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు, లక్షల మంది జీవితాలు ఆగం అయ్యాయయని ఆగ్రమం వ్యక్తం చేసారు. బాధితులకు ఇస్తామని చెప్పిన రూ.10 వేల సహాయం కూడా ఇంకా అందలేదని, అయినా.. 10 వేలు ఎటూ సరిపోవని రూ.25 వేలు సహాయం అందించాలని డిమాండ్ చేసారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలంటూ షర్మిల డిమాండ్ చేశారు.
Srisailam Dam Gates Lifted: శ్రీశైలంలో అద్భుత దృశ్యం.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..