Harish Rao : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు అని ఆయన హెద్దెవ చేశారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప, ఆచరణలో మాత్రం శూన్యం అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
రెగ్యులర్ ఉద్యోగులకు రెండు మూడు వారాలు దాటినా జీతాలు రాకపోవడం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి వేతనాలు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. “బస్తీ దవాఖానల వైద్య సిబ్బందికి అయితే ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది బతుకమ్మ, దసరా పండుగలను ఆనందించలేకపోయారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
USA: అమెరికా సైన్యం తీసుకున్న నిర్ణయంతో ముస్లిం, సిక్కులలో ఆగ్రహం..
అధికారులకు పలుమార్లు వినతులు చేసినా స్పందన లేకపోవడం దుర్మార్గమని, అత్యవసర సేవలు అందించే వైద్య సిబ్బందికే జీతాలు ఇవ్వకపోతే ఇతర శాఖల ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. “పథకాల్లో కోతలు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించక వాతలు.. ఇదే రేవంత్ రెడ్డి పాలన. మాటల్లో ఫేకుడు, ఢిల్లీకి వెళ్లి జోకుడు. నీ వైఫల్యం రాష్ట్ర ప్రజలందరికీ శాపంగా మారింది” అంటూ హరీశ్ రావు తీవ్రంగా దుయ్యబట్టారు. “జీతాలు ఇవ్వకుండా 13 వేల మంది వైద్య సిబ్బందికి దసరా దూరం చేసావు. కనీసం ఇప్పుడైనా జీతాలు చెల్లించి వారికి దీపావళి సంబురం ఇవ్వాలి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ.. పవన్ కల్యాణ్ సూచనలతో ఉత్తర్వులు..
