USA: అమెరికా సైన్యం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమైంది. సైన్యంలో పనిచేస్తున్న వారు తలపాగా ధరించడం, గడ్డాలు పెంచుకోవడాన్ని నిషేధించింది. ఈ నిర్ణయంపై సిక్కులు, ముస్లింలు, ఆర్డోడాక్స్ యూదుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. వీరింతా మతాన్ని ఆచరించడం లేదా సైన్యంలో కొనసాగడాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గడ్డాలు ఉన్న సైనిక సిబ్బంది గురించి ఆ దేశ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి. వీరిని ‘‘ గడ్డాలు, లావుగా ఉన్న జనరల్స్’’ అని హెగ్సేత్ వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యాన్ని పోసినట్లు అయింది.
Read Also: Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ.. పవన్ కల్యాణ్ సూచనలతో ఉత్తర్వులు..
అమెరికా సైన్యం తీసుకున్న నిర్ణయాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) ఈ నిర్ణయాన్ని ఖండించింది. సిక్కులు, పంజాబీలను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదని SGPC ప్రతినిధి గుర్చరణ్ గ్రెవాల్ పేర్కొన్నారు. మతపరమైన ఆచార సమస్యల్ని పరిష్కరించడానికి కమిటీ యూఎస్‌లోని గురుద్వారాలతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని బటిండా ఎంపి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఖండించారు. సిక్కులు తమ విశ్వాసాలను కొనసాగిస్తూనే, యూఎస్ సైన్యంలో సేవలందించారు అని, వారి మతపరమైన గుర్తింపును తొలగించడం అన్యాయమని, ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఆమె అన్నారు. పంజాబ్‌కు చెందిన అన్ని పార్టీల నేతలు అమెరికా నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోరుతున్నారు.