Harish Rao : నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో బాదడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని ఆరోపించిన హరీశ్ రావు, యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఆ యువకుడి చేసిన తప్పా అని ప్రశ్నించారు. “రేవంత్ రెడ్డికి అధికారం రావడం అంటే అరాచకానికి అధికారం తోడైనట్లుంది.
GST Impact in AP: జీఎస్టీ ప్రభావంతో ఏపీలో వాహనాలకు పెరిగిన గిరాకీ.. ఒక్క రోజులో ఎన్ని కొన్నారంటే..?
ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు, అక్రమ అరెస్టులు… ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇవే కనిపిస్తున్నాయి” అని విమర్శించారు. 22 నెలలుగా పాలనను గాలికి వదిలేసి, దౌర్జన్యమే కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. లాఠీ దెబ్బలకు నడవలేని స్థితికి చేరుకున్న ఆ యువకుడి భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. థర్డ్ డిగ్రీ విధానాలతో గిరిజన యువకుడిపై కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
